కంటెంట్‌ను దాటవేయి
  • హోమ్
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండికనెక్ట్ అయ్యి ఉండండిగ్రూప్‌లలో కనెక్ట్ అవ్వండిమీ భావాలను వ్యక్తపరచండి వ్యాపారం కోసం WhatsApp
  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • వ్యాపారం కోసం
  • డౌన్‌లోడ్ చేసుకోండి
డౌన్‌లోడ్ చేసుకోండి
నిబంధనలు & గోప్యతా విధానం2025 © WhatsApp LLC
WhatsApp ప్రధాన పేజీWhatsApp ప్రధాన పేజీ
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండి

      ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మరియు గోప్యతా నియంత్రణలు.

    • కనెక్ట్ అయ్యి ఉండండి

      ప్రపంచవ్యాప్తంగా మెసేజ్ పంపడం మరియు కాల్ చేయడం వంటివి ఉచితంగా* చేయండి.

    • గ్రూప్‌లలో కనెక్ట్ అవ్వండి

      గ్రూప్ మెసేజింగ్ సులభతరమైంది.

    • మీ భావాలను వ్యక్తపరచండి

      స్టిక్కర్‌లు, వాయిస్, GIFలు మరియు మరిన్నింటితో దాన్ని చెప్పండి.

    • WhatsApp Business

      మీ కస్టమర్‌లను ఎక్కడి నుండైనా రీచ్ అవ్వండి.

  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • బిజినెస్ కోసం
  • యాప్‌లు
లాగిన్ చేయండిడౌన్‌లోడ్ చేసుకోండి

WhatsApp మెసేజింగ్ మార్గదర్శకాలు

చివరిగా అప్‌డేట్ చేసినది: ఫిబ్రవరి 16, 2024

WhatsApp అనేది మెసేజ్‌లను పంపడానికి మరియు కాల్‌లు చేసుకోవడానికి ఉద్దేశించబడిన ఒక సులభమైన, సురక్షితమైన మరియు నమ్మదగిన మార్గం. డిఫాల్ట్‌గా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడిన మీ వ్యక్తిగత మెసేజ్‌లను ఇతరులు ఎవరూ, చివరికి WhatsApp కూడా చూడలేదు.

1:1 చాట్‌లు, కాల్‌లు, గ్రూప్ చాట్‌లు మరియు కమ్యూనిటీలకు ఈ మెసేజింగ్ మార్గదర్శకాలు (ఈ “మార్గదర్శకాలు”) వర్తిస్తాయి. స్టేటస్ అప్‌డేట్‌లు కూడా ఈ మార్గదర్శకాలకు లోబడి ఉంటాయి.

WhatsApp Messenger అప్లికేషన్ యొక్క వినియోగం మా సేవా నిబంధనలు మరియు ఈ మార్గదర్శకాల ద్వారా నిర్వహించబడుతుంది. WhatsApp Business అప్లికేషన్ మరి.యు WhatsApp Business ప్లాట్‌ఫామ్‌లతో కూడిన మా వ్యాపార సేవల వినియోగం ఈ మార్గదర్శకాలకు అదనంగా WhatsApp Business సేవా నిబంధనలు మరియు వ్యాపార విధానాల ద్వారా నిర్వహించబడుతుంది.

ప్రాథమిక అకౌంట్, గ్రూప్ మరియు కమ్యూనిటీ ప్రొఫైల్ సమాచారంతో పాటు ఇతర వినియోగదారులు నివేదించిన మెసేజ్‌లతో సహా WhatsAppకి అందుబాటులో ఉన్న పరిమిత సమాచారం ఆధారంగా మా సేవా నిబంధనలు లేదా ఈ మార్గదర్శకాల ఉల్లంఘనలపై WhatsApp చర్య తీసుకోవచ్చు. మీ వ్యక్తిగత మెసేజ్‌లు మరియు కాల్‌లు ఎల్లప్పుడూ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా రక్షించబడతాయి.

  • చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను షేర్ చేయడం లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపంలో పాల్గొనడం చేయకండి ఇందులో (పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్‌తో సహా) చిన్నారులను లైంగికంగా దోచుకునే లేదా వారికి అపాయం కలిగించే కంటెంట్ లేదా నియమించబడిన ఉగ్రవాద సంస్థలు లేదా వ్యక్తులకు మద్దతు ఇచ్చే కంటెంట్ ఉంటుంది. మీకు ఉపయోగించుకునే హక్కు లేని మేధో సంపత్తిని షేర్ చేయకండి. హింసాత్మక నేరాలు, ఇతరులపై హింస, మనుషుల అక్రమ రవాణా లేదా అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం వంటివి నిర్వహించడం లేదా సమన్వయం చేయడం వంటివి చేయకండి.
  • వ్యతిరేక ప్రవర్తనలో పాల్గొనకండి. ఇందులో WhatsApp సమగ్రత సిస్టమ్‌లను బలహీనపరిచే ప్రయత్నాలు, దుర్వినియోగ నివేదన సాధనాలు, వినియోగదారు అకౌంట్‌లను రాజీ చేయడం, డేటాను స్క్రాప్ చేయడం లేదా అనధికారిక క్లయింట్‌లను ఉపయోగించడం, బల్క్ మెసేజింగ్, ఆటో-మెసేజింగ్, ఆటో-డయలింగ్ లేదా ఆటోమేషన్‌తో WhatsApp లేదా మా వినియోగదారులకు హాని కలిగించే ప్రయత్నాలు వంటివి ఉన్నాయి.
  • మోసం లేదా స్పామ్‌లలో పాల్గొనకండి ఇందులో WhatsApp వినియోగదారులను పదేపదే అవాంఛితంగా కాంటాక్ట్ చేయడం అలాగే ఉద్దేశ్యపూర్వక మోసం లేదా వంచన ద్వారా WhatsAppని లేదా మా వినియోగదారులను స్కామ్ చేసే లేదా మోసం చేసే కార్యాచరణ ఉంటుంది.

ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించే అవకాశం ఉన్న WhatsApp కాంటాక్ట్స్, గ్రూపులు, కమ్యూనిటీలు, స్టేటస్ అప్‌డేట్‌లు లేదా నిర్దిష్ట మెసేజ్‌లను వినియోగదారులు నివేదించగలరు. WhatsAppలో నివేదించడం ఎలా అనే దానికి సంబంధించిన మరిన్ని వివరాలను మీరు ఇక్కడ తెలుసుకోగలరు. సంభవనీయ మేధో సంపత్తి ఉల్లంఘనలను నివేదించే విధానానికి సంబంధించిన సమాచారం కోసం, దయచేసి ఇక్కడ చూడండి.

మెసేజింగ్ మార్గదర్శకాలను మేము ఎలా వర్తింపజేస్తాము

ఈ మార్గదర్శకాల సంభవనీయ ఉల్లంఘనల కోసం అకౌంట్, గ్రూప్ మరియు కమ్యూనిటీ ప్రొఫైల్ సమాచారంతో పాటు నివేదించబడిన మెసేజ్‌లతో సహా మాకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని గుర్తించడానికి మరియు సమీక్షించడానికి WhatsApp ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ పద్ధతులు మరియు మానవ సమీక్షా బృందాలు రెండింటినీ ఉపయోగించవచ్చు.

ఆటోమేటిక్‌గా చేయబడే ప్రాసెసింగ్

ఆటోమేటిక్ చేయబడిన డేటా ప్రాసెసింగ్ అనేది మా సమీక్ష ప్రక్రియలో ప్రధానమైనదిగా ఉండడంతో పాటు అకౌంట్ ప్రవర్తన లేదా నివేదించబడిన మెసేజ్ కంటెంట్ ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించే అవకాశం ఉన్న నిర్దిష్ట ప్రాంతాలకు సంబంధించిన నిర్ణయాలను ఆటోమేటిక్‌గా అమలు చేస్తుంది.

ఉల్లంఘించే అవకాశమున్న అకౌంట్‌లు, గ్రూపులు లేదా కమ్యూనిటీలలోని కంటెంట్‌ను సరైన పరిజ్ఞానం మరియు భాషా నైపుణ్యం ఉన్న మానవ సమీక్షకులకు మళ్లించడం ద్వారా సమీక్షకు ప్రాధాన్యత ఇవ్వడం అలాగే వేగవంతం చేయడంలో ఆటోమేషన్ మాకు సహాయపడుతుంది, తద్వారా మా బృందాలు ముందుగా అత్యంత ముఖ్యమైన కేసులపై దృష్టి పెట్టవచ్చు.

మానవ సమీక్ష బృందాలు

అకౌంట్, గ్రూప్ లేదా కమ్యూనిటీకి తదుపరి సమీక్ష అవసరమైనప్పుడు, తుది నిర్ణయం తీసుకోవడానికి మా ఆటోమేటెడ్ సిస్టమ్‌లు దానిని మానవ సమీక్షా బృందానికి పంపుతాయి. మా మానవ సమీక్షా బృందాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, వాటిలోని సభ్యులు క్షుణ్ణమైన శిక్షణ పొంది తరచుగా నిర్దిష్ట విధాన ప్రదేశాలు మరియు ప్రాంతాలలో ప్రత్యేకతను కలిగి ఉండడంతో పాటు అకౌంట్ సమాచారాన్ని అలాగే నివేదించబడిన మెసేజ్‌లను సమీక్షించగలవు. వ్యక్తిగత మెసేజ్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా రక్షించబడతాయి. మా ఆటోమేటెడ్ సిస్టమ్‌లు ప్రతి నిర్ణయం నుండి నేర్చుకోవడంతో పాటు వాటి నుండి తమను తాము మెరుగుపర్చుకుంటాయి.

స్థానిక చట్టాల ఉల్లంఘనలు

WhatsAppలోని అకౌంట్‌లు, గ్రూపులు లేదా కమ్యూనిటీలు స్థానిక చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని ప్రభుత్వాలు విశ్వసించినప్పుడు, మాకు అందుబాటులో ఉన్న అకౌంట్ సమాచారాన్ని సమీక్షించవలసిందిగా వారు మమ్మల్ని అభ్యర్థించవచ్చు. వ్యక్తిగత మెసేజ్‌లు మరియు కాల్‌లు ఎల్లప్పుడూ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా రక్షించబడతాయి. WhatsApp అకౌంట్‌లను పరిమితం చేయవలసిందిగా మేము కోర్టు నుండి ఉత్తర్వులను కూడా అందుకోవచ్చు. ఏదైనా చర్యను తీసుకోవడానికి ముందు మేము ప్రభుత్వ అభ్యర్థన యొక్క చట్టబద్ధత మరియు సంపూర్ణతను ఎల్లప్పుడూ అంచనా వేస్తాము.

మేము తీసుకోగల చర్యలు

చట్టవిరుద్ధమైన కంటెంట్ లేదా మా నిబంధనలు మరియు విధానాల ఉల్లంఘన వంటి వాటి గురించి మాకు తెలిసినప్పుడు, మేము క్రింది వాటితో సహా కంటెంట్ లేదా ఉల్లంఘన యొక్క స్వభావాన్ని బట్టి చర్య తీసుకోవచ్చు:

  • ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వినియోగదారులను హెచ్చరించడం
  • మా సేవలోని అకౌంట్‌ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేయడం
  • గ్రూపులు మరియు/లేదా కమ్యూనిటీలలో తదుపరి కార్యాచరణను నిరోధించడం [మరింత సమాచారం ఇక్కడ ఉంది]
  • ఉల్లంఘించే అకౌంట్ లేదా గ్రూప్ ప్రొఫైల్ సమాచారాన్ని మా సర్వర్‌ల నుండి తొలగించడం
  • గ్రూప్ లేదా కమ్యూనిటీకి చెందిన ఆహ్వాన లింక్ యొక్క ఉపయోగాన్ని ఉపసంహరించుకోవడం లేదా నిరోధించడం మరియు/లేదా
  • చిన్నారుల లైంగిక వేధింపుల విషయాలను NCMEC మరియు/లేదా సమర్థ అధికారులకు నివేదించడం

WhatsApp సేవా నిబంధనలలో ప్రతిబింబించే విధంగా మేము అదనపు చర్యలు తీసుకోవచ్చు.

డౌన్‌లోడ్ చేయి
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్ చేయి
మేము ఏమి చేస్తాము
ఫీచర్‌లుబ్లాగ్భద్రతబిజినెస్ కోసం
మేము ఎవరు
మా సమాచారంకెరీర్‌లుబ్రాండ్ సెంటర్గోప్యత
WhatsAppని ఉపయోగించండి
AndroidiPhoneMac/PCWhatsApp Web
సహాయం కావాలా?
మమ్మల్ని కాంటాక్ట్ చేయండిసహాయ కేంద్రంయాప్‌లభద్రతా సలహాలు
డౌన్‌లోడ్ చేయి

2025 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానం
సైట్‌మ్యాప్